మహేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "ఆగడు". శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం తమన్నా చేయట్లేదని తెలిసింది. ఎందుకంటే ఇప్పటికే తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉండడం వలన తమన్నా ఈ చిత్రం నుండి తప్పుకుందని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రంలో మహేష్ జోడి కోసం మరో హీరోయిన్ వేటలో ఉన్నాడట దర్శకుడు శ్రీనువైట్ల. 14రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
No comments:
Post a Comment